ప్రభుత్వ ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
మంచిర్యాల టౌన్, ఆగస్టు 2: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న నూతన ప్రభుత్వ ఆసుపత్రి పనులను మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యత ప్రమాణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆధునిక సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎం ఎల్ ఏ వెంట మేయర్ ధర్ని మధుకర్, అధికారులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.






