నేషనల్ హైవే పనులను పరిశీలిoచిన ఎమ్మెల్యే
చేవెళ్ల, నవంబర్ 19(విజయక్రాంతి): బీజాపూర్‌హైదరాబాద్ జాతీయ రహదారి పనులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య బుధవారం క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించారు. అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్‌హైదరాబాద్ నేషనల్ హైవే నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించినా ఆయన పలు సలహాలు, సూచనలు చేశారు. రహదారి పనుల్లో నాణ్యత, పని వేగం, కాంట్రాక్టర్ల సమన్వయం వంటి అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష చేసి పనుల్లో మరింత వేగం తీసుకురావాలని ఆదేశించారు.
ప్రజలకు అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హైవే పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. హైవే పనులు అయితే భవిష్యత్ లో చేవెళ్ల, వికారాబాద్, తాండూర్, పరిగి పరిసర ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఊతం లభిస్తుందన్నారు. ప్రజలు గత కొంత కాలం గా ఎదురుచూస్తున్న ఈ రహదారి పనులు త్వరితగతిన పూర్తి కావడానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తోంది అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.






