calender_icon.png 20 November, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పండి

19-11-2025 11:31:50 PM

బీఆర్‌ఎస్‌కు మంత్రి తుమ్మల ప్రశ్న

హైదరాబాద్ (విజయక్రాంతి): రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ‘బీఆర్‌ఎస్ పెద్దలు.. మీ ఇంట్లో కుంపటిని రాష్ట్రం అంతా పెట్టొద్దు. ముందు మీ ఇంటి ఆడబిడ్డ (కవిత) అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన కవిత.. తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ లీడర్లను వదులుకోవడం కేసీఆర్ తప్పేనని ఆ ప్రభావం వల్లే రాష్ర్టంలో బీఆర్‌ఎస్ ఓటమి పాలైందని వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల స్పందించారు.

తమ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేసే ముందు కవిత చేసిన వ్యాఖ్యలకు సమాధానాలు చెప్పాలని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పత్తి కొనుగోలు జరపాలని ప్రధాని మోదీ ప్రకటన చేస్తారని, మరోవైపు సీసీఐ నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతోందని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎంఎస్పీకి పంటలు కొనే రాష్ర్టం తెలంగాణ అన్నారు. 20 శాతం వరకు తేమ ఉన్నా పత్తి కొనాలని సీసీఐకి చెప్పామని, ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి నిబంధన ఎత్తివేయాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. సీసీఐ నిబంధనలు మార్చి రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనాలన్నారు.