20-11-2025 12:00:00 AM
ఘట్ కేసర్, నవంబర్ 19 (విజయక్రాంతి) : వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్శిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 17వతేదీ నుండి 21 వరకు అంతర్జాతీయ స్థాయి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ రంగంలో జరుగుతున్న తాజా పరిశోధనలు, ఆధునిక మోడల్స్, గ్లోబల్ ట్రెండ్స్ను అధ్యాపకులకు పరిచయం చేయడం ఈకార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
అంతర్జాతీయ నిపుణుల లెక్చర్లు, ప్రాక్టికల్ సెషన్లు, పరిశోధనోన్నతి అవకాశాలపై చర్చలు ఈ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ కార్యక్రమానికి 170 మంది అంతర్జాతీయ విద్యా సంస్థల నుండి అధ్యాపకులు భారీగా హాజరైనారు. ఆధునిక సాంకేతిక ధోరణులపై లోతైన అవగాహన కల్పించే ఈకార్యక్రమం, అధ్యాపకులను పరిశోధన, ఆవిష్కరణల వైపు ప్రేరేపించే సమగ్ర వేదికగా నిలుస్తోందన్నారు.
ఈ కార్యక్రమానికి దిశానిర్దేశం అందిస్తున్న సమాచార సాంకేతిక విభాగాధిపతి డాక్టర్ నీతీషాశర్మ, అధ్యాపకులు తమ జ్ఞానం, పరిశోధనా దృష్టి, బోధనా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోడానికి ఈప్రోగ్రామ్ ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. ఈ ఎఫ్.డీ.పీ.కు కన్వీనర్లుగా డాక్టర్ ఆశాకిరణ్, డాక్టర్ పద్మజ, డాక్టర్ పి.వి. కుమార్ వ్యవహరిస్తున్నారు.