21 August, 2026 | 11:03 PM

PMH బాలుర వసతి గృహంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

21-08-2026 10:32 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య టేకులపల్లి మండలం గోలియాతండ గ్రామపంచాయతీ పరిధిలోని PMH బాలుర వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని విద్యార్థులు ఉంటున్న వసతి గృహాన్ని, హాస్టల్ ప్రాంగణాన్ని పూర్తిగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి హాస్టల్‌లో ఉన్న సమస్యలు, అందుతున్న సౌకర్యాలు, వారు అభ్యసిస్తున్న విద్య తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు. అయితే తనిఖీ సమయంలో హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల వసతి, విద్య, సంక్షేమంపై అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి ఎస్‌ఐ కె. తిరుపతి, ఇల్లందు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్, కాంగ్రెస్ నాయకులు మూడ్ శ్రీను, జాటోత్ రవీందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.