calender_icon.png 20 February, 2026 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే పరామర్శ

20-02-2026 04:48:23 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ఇటీవల మాదారం గ్రామంలో జరిగిన రహదారి ప్రమాదంలో లారీ ఆటో ఢీకొని గాయపడిన కొత్త గంగారం గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద బాధితులను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం రాత్రి పరామర్శించారు. కొత్త గంగారం గ్రామంలో సర్పంచ్ సోడే చైతన్య తో కలసి లారీ ఆక్సిడెంట్ లో గాయపడిన కారం సంధ్య, కణితి భూలక్ష్మిని పరామర్శించి ఇద్దరికీ కొంత నగదు సహాయం అందజేశారు. వైద్యం కోసం వీరికి హాస్పిటల్ లో అయిన ఖర్చులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరయ్యేటట్లు చేస్తానని హామీ ఇచ్చారు.