21 August, 2026 | 4:22 AM

పిడుగు పడి వ్యక్తి మృతి

27-06-2026 05:54 PM

చిన్న శంకరంపేట్/చేగుంట,(విజయక్రాంతి): చిన్నశంకరంపేట మండలం దరిపల్లి శివారులో శనివారం మధ్యాహ్నం పిడుగు పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెల్లుర్తి గ్రామానికి చెందిన పనిగంటి  మైసయ్యా (42)వ్యవసాయ బోరు వద్ద బోరు  మరమ్మతులు చేస్తుండగా, అకాల వర్షం పడడంతో చెట్టు కింద తలదాచుకున్నాడు. అదే సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.