వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించాలి.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహా కార్యదర్శి ముదిగొండ రాంబాబు.
ములకలపల్లి,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట జులై 1న జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహా కార్యదర్శి ముదిగొండ రాంబాబు కోరారు. శనివారం మండల కేంద్రములోని సిఐటియు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్ధానం లో జూలై 1 నుంచి బిజెపి ప్రభుత్వం విబి జీ రామ్ జీ చట్టాన్ని తీసుకొచ్చి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి బీజీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహారించుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వంపై దశలవారీగా ఆందోళనలు చెపడాతామని హెచ్చరించారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విబి జీ రామ్ జీ చట్టాన్ని తీసుకువచ్చి 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.200 వందల రోజులకు పనిదినాలు పెంచి రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు గోపగాని లక్ష్మీ నరసయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.






