22 May, 2026 | 4:21 PM

సెక్రటేరియట్ లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు అందజేసిన ఎమ్మెల్యే జారె

22-05-2026 03:48 PM

దమ్మపేట,(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని తెలంగాణ సెక్రటేరియట్ నందు అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన అనారోగ్య బాధితుల నుంచి స్వీకరించిన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) దరఖాస్తులను ఆ విభాగంలో సంబంధిత అధికారులకు అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శుక్రవారం అందజేశారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులతో వైద్యం పొందుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్ధిక సహాయంతో పాటు నిమ్స్ ఆసుపత్రిలో విలువైన వైద్యం ఉచితంగా అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన బాధ్యతని, అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎం ఎల్ ఎ జారే తెలిపారు.