22 May, 2026 | 4:38 PM

రాష్ట్ర అబ్జర్వర్ గా పొన్నమనేని బాలాజీ రావు నియామకం

22-05-2026 03:46 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఈ నెల  20 నుండి,జూన్ 20 వరకు నిర్వహించే జెండా పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పొ న్నమనేని బాలాజీ రావును పెద్దపల్లి జిల్లా జెండా పండుగ రాష్ట్ర అబ్జర్వర్గా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. ఈ సందర్భంగా పోన్నమనేని బాలాజీ రావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో పెద్దపల్లి జిల్లా రాష్ట్ర అబ్జర్వర్గా నియామకం చేసినందుకు కల్వకుంట్ల కవితకు బాలాజీ రావు కృతజ్ఞతలు తెలిపారు. జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. బాలాజీ రావు రాష్ట్ర అబ్జర్వర్గా నియామకం కావడంతో శుక్రవారం సుల్తానాబాద్ లో పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు.