calender_icon.png 22 November, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప ఎన్నిక వచ్చినా నేనే అభ్యర్థి.. గెలిచేది కూడా నేనే: కడియం

22-11-2025 01:30:01 PM

హైదరాబాద్: అనర్హత పిటిషన్ పై ఈ నెల 23లోపు కలవాలని స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) నోటీసు ఇచ్చారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) వెల్లడించారు. నోటీసులపై వివరణకు మరింత సమయం కావాలని స్పీకర్ ను కోరినట్లు కడియం తెలిపారు. సమయం కావాలని అడిగితే.. స్పీకర్ సానుకూలంగా స్పందించారని సూచించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని కడియం వివరించారు. నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ''ఉపఎన్నిక వచ్చినా నేనే అభ్యర్థి.. పోటీ చేసేది నేనే.. గెలిచేది కూడా నేనే'' అని కడియం ధీమా వ్యక్తం చేశారు. తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు తననే గెలిపిస్తారని చెప్పారు. అభిమానులు, న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నానని కడియం పేర్కొన్నారు. తన రాజీనామాపై ప్రతిపక్షాలు చాలా ఉత్సాహంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.