21-02-2026 05:39:49 PM
అగ్నిమాపాక కేద్రం అవసరతను ముందే తెలిపిన విజయక్రాంతి పత్రిక
అయిజ: అయిజ మున్సిపాలిటీలో డ్రిప్ పైపుల కంపెనీలో విద్యుత్ షాట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం సంభవించిoదని యజమాని ప్రతాప్ రెడ్డి అన్నాడు. మనుషులతో మంటలను అదుపు చేసిన సాధ్యం కాలేదని ఫైర్ ఇంజన్లు వచ్చిన తర్వాత వాటికి కూడా కష్టతరంతో మంటలు అదుపులోకి వచ్చాయని చూసిన స్థానికులు తెలియజేశారు. సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే విజయుడు, స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ సీఎం సురేష్ మొదలగు టీఆర్ఎస్ కార్యకర్తలు సంఘటన స్థలానికి చేరుకొని దగ్ధమైన డ్రిప్ కంపెనీని పరిశీలించడం జరిగిందన్నారు.
ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ వ్యక్తి అయిన ప్రతాపరెడ్డి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తికి ఇలా జరగడం బాధాకరమని ఆయనకు ధైర్యం చెప్పారు. ప్లాస్టిక్ వస్తువులు కావున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయిన వెంటనే ప్రమాదo తీవ్రస్థాయికి చేరుకొని ఉంటుందని, అందువల్ల మంటలను అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడిందని,అగ్నిమాపక కేంద్రాలు 30 కిలోమీటర్ల పైనే ఉన్నందువల్ల, సకాలంలో చేరుకోలేక భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని, దీని విలువ సుమారు మూడు కోట్లకు పై మాటే అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయిజ మున్సిపాలిటీలోని అగ్నిమాపక కేంద్రం ఎంత అవసరమో ముందే ఊహించి రాసిన విజయ క్రాంతి పత్రిక. ఏది ఏమైనా అగ్నిమాపక కేంద్రం అందుబాటులో ఉంటే ఇంత భారీ నష్టం జరిగేది కాదని స్థానికులు అనుకుంటున్నారు ఇకనైనా పాలకులు గానీ, ప్రభుత్వం గానీ అయిజలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజల తమ ఆవేదన వ్యక్తం చేశారు.