15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

లోక్యతండా పాఠశాలకు వాటర్ కూలర్ బహూకరణ

21-02-2026 05:21 PM

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలంలోని లోక్యతండా ప్రాథమికోన్నత  పాఠశాలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన తాటి శ్రీనివాస్ వాటర్ కూలర్ ను బహుకరించారు. వేసవికాలం దృష్ట్యా విద్యార్థులకు చల్లని నీరు అందించేందుకు వాటర్ కూలర్ ను అందించాలని నిర్ణయించి శనివారం సర్పంచ్ వెంకట్ సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాదె వెంకన్నకు అందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ... వేసవి కాలంలో విద్యార్థులకు వాటర్ కూలర్ అందించడం అభినందనీయమన్నారు. దాతలు ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. హెచ్ఎం మాట్లాడుతూ..  దాతలు మందుకు వచ్చి  విద్యాభివృద్ధికి తోడ్పాటును అందించడం ఇతరులకు ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా దాత శ్రీనివాస్ ను  సర్పంచ్  వడ్త్యా. వెంకటేష్, ఉప సర్పంచ్ నీలమ్మ, వార్డ్ సభ్యులు,  వడిత్య శ్రీను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుభద్ర, రవిరత్నం విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.