29 August, 2026 | 4:14 PM

జీవో 97 రద్దు చేయాలి: కడియం శ్రీహరి

29-08-2026 03:39 PM

ప్రభుత్వం పెద్ద మనుసు చేసుకుని జీవో 97ను రద్దు చేయాలి

హైదరాబాద్: మాజీ విద్యాశాఖ మంత్రిగా జీవో 97ను రద్దు చేసి, పాలిటెక్నిక్‌ను(Polytechnic) ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌తో కలిపే ఉంచాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  జీవో 97తో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నందున పాలిటెక్నిక్ విద్యార్థులను టెక్నికల్ ఎడ్యుకేషన్‌లోనే కొనసాగించాలిని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్ కు ఇబ్బంది ఉండదనీ భరోసాను ప్రభుత్వం కల్పించాలని కడియం సూచించారు. ప్రజా ప్రభుత్వం పెద్దమనసు చేసుకుని జీవో 97 ను రద్దు చేయాలని తెలిపారు. GO 97ను రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా  పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.