ఓటర్లకు ఎస్‌ఐఆర్ నోటీసులు
29-08-2026 | 03:58pm
కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఓలు...
బాన్సువాడ, ఆగస్టు 29 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ ) ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ఓటర్లకు నోటీసులు అందజేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవల్ అధికారులు కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు నోటీసులు అందజేశారు.నోటీసుల్లో పేర్కొన్న వివరాలను పరిశీలించుకోవాలని, అవసరమైన పత్రాలతో నిర్ణీత సమయంలో స్పందించాలని ఓటర్లకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.