14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

రెండేండ్లయినా రోడ్డు వేయకుండా చేతులెత్తేసిన ఘనత ఎమ్మెల్యే కవ్వంపల్లిది

03-01-2026 09:23 PM

మానకొండూర్,(విజయక్రాంతి): ఒడ ఎక్కేదాకా ఒడ మల్లన్న ఒడేక్కాక బోడి మల్లన్న  అన్న చందంగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరు ఉందని, సాధారణ ఎన్నికలప్పుడు లబ్ధిపొందేందుకు డబుల్ రోడ్ పేరుతో రాజకీయం చేసి ప్రజల ఓట్లతో గద్దెనెక్కి.. తీరా డబుల్ రోడ్ ను రెండ్లు సంవత్సరాలు అయినా పూర్తి చేయకుండా చేతులెత్తేసిన ఘనత కవ్వంపల్లికే దక్కుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఎద్దేవా చేశారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వంద రోజుల్లో గుండ్లపల్లి నుండి గన్నేరువరం మీదుగా ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు రెండు వరుసల రహదారి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం  తీరా ప్రజలను నిండా ముంచి అవస్థల పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కంకర తేలిన రోడ్డుతో ప్రజలు  నరకయాతన అనుభవిస్తున్నారని, గునుకుల కొండాపూర్ వద్ద ప్రమాదకరంగా ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ  శాశ్వత చర్యలు  తీసుకోలేదని అన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి నిర్లక్ష్య వైఖరితో రోడ్డు  పనుల్లో  తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రభుత్వం, సంబంధిత మంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు మంజూరు చేయించి పనులను వెంటనే ప్రారంభించాలని లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉధ్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.