calender_icon.png 7 January, 2026 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పుల తడకగా ఓటర్ జాబితా

03-01-2026 09:18:51 PM

- బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్

కరీంనగర్,(విజయక్రాంతి): నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్ల లో ఇటీవల ప్రచురించిన ఓటరు జాబితా తప్పులు తడకగా ఉందని, ఓటరు జాబితాను సవరణ చేయాలని బిఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్  కోరారు.  శనివారం మున్సిపల్ కమిషనర్  ప్రపుల్ దేశాయ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో  మాజీ కార్పొరేటర్లు, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.