03-01-2026 09:28:51 PM
పెద్దపల్లి,(విజయక్రాంతి): మహిళలు చట్టాల పట్ల కొంత అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ జైలు లీగల్ సర్వీస్ అథారిటీ సంయుక్తంగా మహిళా సంఘాల సభ్యులకు నిర్వహించిన ప్రభుత్వ శాఖల ద్వారా ప్రభుత్వ అర్జెంటు స్కీములు, చట్టాల పట్ల అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ వంగార భవాని తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ మహిళలు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, మన చుట్టుపక్కల జరిగే హింస, చట్ట విరోధ కార్యక్రమాలను అడ్డుకోవడానికి మన వంతు ప్రయత్నం చేయాలని ఆమె తెలిపారు. ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు.