5 May, 2026 | 3:16 AM

కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతే ఊరుకోం..

05-05-2026 01:54 AM

జరిగిన సంఘటనపై మాట్లాడాలే గాని భాధ్యత మరచి బలుపు మాటలు మాట్లడమేంటి 

కరీంనగర్ గడ్డకు వచ్చి కేటిఆర్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు ఇక చూస్తూ ఊరుకోం 

ఖచ్చితంగా దుండగులను సాధ్యమైనంత తొందరగా పట్టుకుంటాం 

సంఘటన జరిగిన వెంటనే ముగ్గురం ఎమ్మెల్యేలం,చైర్మన్ అందరం పర్యవేక్షిస్తుంటే మీ కళ్లు మూసుకున్నారా 

అన్నిటినీ రాజకీయ కోణంలోనే చూస్తారా.. విలువైన సూచనలు చేయరా..? 

కేటీఆర్ మాటలను తీవ్రంగా ఖండించిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సుడా చైర్మన్ కోమటిరెడ్డి

ముకరంపుర, మే4 (విజయక్రాంతి): జరిగిన సంఘటన పై భాద్యత గల పదవిలో ఉన్న కేటీఆర్ విలువైన సూచనలు ఇవ్వాలే గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఇష్టారాజ్యంగా మాట్లడమేంటని మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ,సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు.స్థానిక ఆర్‌అండ్ బి గెస్ట్ లో కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ తో కలిసి మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జువెల్లరీ షాపులో దొంగతనం జరుగుతేదాన్ని రాజకీయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బిఆర్‌ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ బలుపు మాటలు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.దోషులను తప్పకుండా పట్టుకొని శిక్షిస్తామని గత బిఆర్‌ఎస్ పాలనలో ఎం జరిగిందో ప్రజలకు తెలుసని అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదని చెప్పుతలేమని మంథని లో వామన్ రావు మరియు అతని భార్యను నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపినప్పుడు మేము మీలాగా రాజకీయం చేయలేదని దోషులను శిక్షించాలని అన్నామని అదికూడా మీకు చేతకాలేదని మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో వూట్కూరి వెంకటరమణ రెడ్డి, మోరపల్లి రమణరెడ్డి, పులి కృష్ణా, తిరుపతి రెడ్డి, కొరివి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.