1 May, 2026 | 9:18 PM

మేడే సందర్భంగా కార్మికుల జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

01-05-2026 08:26 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు మండలం సుభాష్ నగర్ గ్రామపంచాయతి కరెంట్ ఆఫీస్ సెంటర్ లో మేడే దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆటో ట్రాలీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య  హాజరై వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి జండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.