సోనాల మండల కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
15-08-2026 02:59 PM
బోథ్ ఆగస్టు 15 (విజయక్రాంతి): స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సోనాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు గ్రామపంచాయతీలలో సర్పంచులు జెండా ఆవిష్కరించగా మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో మల్లేష్ ఎంపీడీవో రత్నాకర్ రావులు జాతీయ జెండాలను ఎగరవేశారు. వివిధ పాఠశాల విద్యార్థులు దేశభక్తి నినాదాలు చేస్తూ మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు స్వతంత్ర దినోత్సవ వేడుకల గురించి విద్యార్థులకు వివరించారు. స్వాతంత్రం తీసుకువచ్చేందుకు ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారని వివరించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






