ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య
13-04-2026 02:17 PM
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బద్దుతండా పంచాయతీ పరిధిలోని సామ్యతండా గ్రామంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ.. నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని, బిల్లుల చెల్లింపులు విషయంలో జాప్యం చేయకుండా చూడాలని ఏఈ గణేష్ ని అదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, స్థానిక సర్పంచ్ నరేష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




