calender_icon.png 27 December, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు హాజరైన ఎమ్మెల్యే కోరం

27-12-2025 12:13:55 AM

టేకులపల్లి, డిసెంబర్ 26, (విజయక్రాంతి):టేకులపల్లి మండలం ముత్యాలంపా డు x రోడ్డు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు పూర్తి అయిన సందర్బంగా లబ్దిదారుల ఇళ్ళు గృహప్రవేశం కార్యక్రమానికి ముఖ్య అతిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరై ప్రారంభించి లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. సొంత ఇంటి కల నెరవేరిందం టూ ఆనందంతో లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేని లబ్ధిదారులు శాలువాతో ఘనంగా సన్మానిం చారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణం త్వరలో పూర్తి చేస్తామని, రెండో విడతలో అర్హులైన వారిని ఎంపిక చేస్తామన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల లభ్ధిధారులు మూడు విజయ,భుక్యా కళావతి గ్రృహ నిర్మాణం పూర్తి చేసినందుకు అభినందించారు. ఇల్లం దు నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 మంది కుటుంబాలకు లబ్ది చేకూర్చామని, అదనంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అతి త్వరలో మరి కొన్ని ఇందిరమ్మ ఇళ్ల ప ట్టాలు పంపిణీ చేయబోతున్నామని తెలిపా రు.

విడతల వారీగా అర్హులైన ప్రతీ ఒక్క పేదవానికి ఇందిరమ్మ ఇళ్ళు అందిస్తామని, మొ దటి విడతలో ఇళ్ళు రాణి వాళ్లు నిరాశ చెందవద్దన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, ఇందిరమ్మ ఇ ల్లు, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బ స్సు ప్రయాణం, రైతు భరోసా, డ్వాక్రా మ హిళలకు ఇందిరమ్మ చీరలు, గ్యాస్ సబ్సిడీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, బ్రిడ్జిలు,సైడ్ కాలువలు వం టి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రజా ప్ర భుత్వమన్నారు.

ప్రజలు ప్రజా పాలన రే వంత్ రెడ్డి ప్రభుత్వం వైపే ఉన్నారని అనటానికి మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనమన్నారు. ఇల్లందు నియోజకవర్గం లో 138 స్థానాలకు గాను అత్యధిక 101 స్థా నాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అ భ్యర్థులు గెలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయ కులు కోరం సురేందర్, మండల అధ్యక్షులు దేవా నాయక్, మార్కెట్ చైర్మన్ రాంబాబు, సర్పంచ్ బానోత్ పూలభంతి, ఉప సర్పంచ్ నాగేశ్వరావు, టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, ఎస్త్స్ర రాజేందర్, మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, హోసింగ్ ఏ ఈ గణేష్, పంచాయతీ సెక్రటరీ, ఆత్మ క మిటీ చైర్మన్ మంగీలాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.