27-12-2025 12:15:36 AM
పాల్వంచలో ఘనంగా సీపీఐ శత వసంతాల ముగింపు వేడుకల
పాల్వంచ, డిసెంబర్ 26, (విజయక్రాంతి):ప్రజా ఉద్యమాలే సీపీఐకి ఆయుధ మని, మనిషిని మనిషి దోపిడి చేయని సమసమాజ నిర్మాణంకోసం ఆవిర్భవించిన సిపి ఐ నాటి నుంచి నేటివరకు ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుదూ ప్రశ్నించే తత్వాన్ని నేర్పిందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం పునరుద్దాటించారు. సిపిఐ శత వసంతాల ఆవిర్భావ వార్నికోత్సవాల ముగింపు వేడుకలను పాల్వంచలోనీ చండ్ర రాజేశ్వరరావు భవన్ (సీపీఐ కార్యాలయం వద్ద) ఘనంగా నిర్వహించారు. కార్య లయం ఎదుట అరుణపతకని ఆవిష్కరించారు.
అనంతరం ద్విచక్ర వాహన ర్యాలీ తో మండల పరిధిలోని పాండురంగపురం గ్రామంలో 100 సంవత్సరాల పైలాన్ వద్ద అరుణపతకని ఆవిష్కరించి ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లడుతూ కార్మిక, కర్షక, ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేసే సత్తా కమ్యూనిస్టలకే ఉంది అన్నారు. దేశ స్వాతంత్య్ర కోసం, పాల క వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర ఉద్యమాలతో ప్రజా చైతన్యాన్ని రగి లించిన పార్టీ సిపిఐ ఎన్నో త్యాగాలు చేస్తూ బ్రిటీష్ కాలం నుండి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు ఏర్పడిందని స్పష్టం చేశారు.
అప్పటి రజాకార్ల, భూస్వాముల, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి దొరలను, దేశ్ముఖ్లను తరిమికొట్టి లక్షలాది ఎకరాల భూమిని పంచి బాంచన్ దొర నీకాల్మోకుత అని బతికే బడుగు బలహీన జీవులు బందూకులు పట్టించి గెరిల్లా రైతాంగ పోరాటం నడిపించిన చరిత్ర సీపీఐదన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా హక్కుల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమిస్తున్న పార్టీ సిపిఐ అన్నారు.
100 ఏండ్ల సు ధిర్ణ ప్రస్తానంలో సిపిఐ నిర్వహించిన పోరాటాలు, ఉద్యమాలతో ప్రజలకు, కార్మికవ ర్ష్గానికి అనేక హక్కులు, సౌకర్యాలు సాధించి పెట్టిట్టామని, ఎందరో అమరవీరులు నేలకొరిగారని, మరెందరో ప్రజలకోసం తమ జీవితాలను త్యాగం చేశారని వారి ఆశయాలను సాధించేందుకు పార్టీ శ్రేణులు అనునిత్యం శ్రమించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా,
వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, జిల్లా సమితి సభ్యులు వరక అజిత్, బండి నాగేశ్వరరావు, గుండాల నాగరాజు, వీ పద్మజ, వీసంశెట్టి విశ్వేశ్వరరా వు, సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు నిమ్మ ల రాంబాబు సీపీఐ, ప్రజాసంఘాలు నాయకులు శనగరపు శీను, డి చెన్నయ్య, నరహరి నాగేశ్వరరావు, IAL రాష్ట్ర కార్యదర్శి ఉప్పుశెట్టి సునీల్‌తేజావత్ విజయ్ కుమార్, భూ క్యా రమేష్, సురేష్, రమేష్, హరి, శ్రీను, రమేష్, కృష్ణ, అల్లి వెంకటేశ్వర్లు, మోహన్, వీరు, సీపీఐ సర్పంచులు, ఉప్ప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.