27-12-2025 12:12:34 AM
ఓడినా వెల్లడించాలసిందే
ఖమ్మం టౌన్, డిసెంబర్ 26 (విజయ క్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా, ఓడిన ఎన్నికల సంఘానికి లెక్కలు అప్ప చెప్పాల్సిందే. ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడతలో పోటీ చేసిన వారు జనవరి 24 లో పు, రెండో విడతలో పోటీ చేసిన వారు జనవరి 27 లోపు, మూడో విడతలో పోటీ చేసి న వారు జనవరి 30వ తేదీ లోపు ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాల లెక్కలు అప్ప చెప్పా ల్సి ఉంది.
ఖమ్మం జిల్లాలో మూడు విడతల్లో 566 సర్పంచులకు 5166 వార్డు స భ్యులకు ఎన్నికలు నిర్వహించారు. ఆయా పంచాయతీల్లో పోటీ చేసి గెలిచిన, ఓడిన వారందరూ కూడా ఎన్నికల సంఘానికి ఖర్చు వివరాలు నిర్దేశించిన ప్రొఫార్మాలో ఆయా మండల ఎంపీడీవోకు వివరాలను తె లపవలసి ఉంది. నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి ఫలితాలు వెల్లడించిన రోజు వరకు అయిన ఖర్చు వివరాలను అధికారులకు అందజేయాల్సి ఉంది.
వ్యయ పరిమితి జనాభా 5000 లోపు గల పంచాయితీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ. 1,50,000/-, వార్డు సభ్యులు రూ. 30,000/- లోపు, జనాభా 5000 పైbగల పంచాయతీ లకు సర్పంచి అభ్యర్థి రూ. 2,50,000/- ల లోపు వార్డు సభ్యులు రూ. 50,000/- లలోపు ఖర్చు చేసుకోవచ్చు. ఒకవేళ నిర్దేశించిన సమయంలోపు ఖర్చు వివరాలను గెలిచిన అభ్యర్థి అధికారులకు అందజేయకపోతే తన పదవి కోల్పోతారు. ఓడిన అభ్యర్థి ఖర్చు వివరాలు అందజేయకపోతే మూడు ఏళ్లపాటు వారు ఏ ఎన్నికల్లో పోటీ చేయటానికి అర్హత ఉండ దు.
ఆశా వహులు జాగ్రత్త పడాల్సి ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు అభ్యర్థులు రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో నైనా పోటీచేసి గెలుపొందాలనే ఉద్దేశంతో వున్న ఆశా వహులు జాగ్రత్త పడాల్సి ఉంది. భవిష్యత్తులో పోటీ చేయాలంటే ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.