14-11-2025 05:20:53 PM
అయ్యప్ప మాలధారణ స్వీకరించిన కోవ లక్ష్మీ దంపతులు
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతతను చేకూరుస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గురుస్వామి ఆధ్వర్యంలో కోవలక్ష్మి,సోనేరావు దంపతులు ఇరువురు అయ్యప్ప మాల ధారణ స్వీకరించారు. ఎమ్మెల్యే మొదటిసారి అయ్యప్ప మాల వేసుకున్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వామి మాల ధారణ చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు దూడల అశోక్, ప్రేమ్, రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.