14-11-2025 05:17:56 PM
ఎంపీడీవో సంతోష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు
చివ్వెంల,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామంలోని మధ్యాహ్న భోజన కేంద్రాలను ఎంపీడీవో సంతోష్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజనానికి ఉపయోగించే బియ్యం స్టాక్ నిల్వలు, నాణ్యత, వంట విధానం, విద్యార్థులకు అందుతున్న ఆహార ప్రమాణాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. భోజనం శుభ్రత, సమయపాలన, పోషక విలువలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత సిబ్బందికి ఎంపీడీవో సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్‌మాస్టర్ రవీందర్, గ్రామ కార్యదర్శి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.