14-11-2025 05:28:48 PM
ఉప్పల్,(విజయక్రాంతి): బాల్యం ఒక భాగ్యమని ఉప్పల్ సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి అన్నారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్స్ ప్రైమరీ స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం అనేది ఒక భాగ్యమని చిన్నతనం మరవలేని మరుపురాని తీపి జ్ఞాపకాలని అన్నారు. జీవితంలో ఒకసారి వచ్చే ఈ ఆనందాన్ని బాలల దినోత్సవం గా జరుపుకోవడం మనకే సాధ్యమని ఇదే మన దేశ సంస్కృతిని అని పేర్కొన్నారు. అనంతరం కేకు కట్ చేసి పిల్లలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.