8 April, 2026 | 2:18 AM

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

08-04-2026 12:35 AM

బిచ్కుంద, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరులో 30 లక్షల రూపాయల సిసి రోడ్డు పనులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనూరు గ్రామ అభివృద్ధికి  మరో కీలక అడుగు ముందుకు వేసినట్లు తెలిపారు.

30 లక్షల సిసి రోడ్డు తో పాటు మరో 30 లక్షలతో సొసైటీ గోదాం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును గ్రామస్తులు సన్మానించి అభినందించారు.