17 April, 2026 | 11:56 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

సంపు హౌస్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన

28-06-2025 12:00 AM

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 27 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కరెగట్టు ,సారెకల్ గ్రామాలకు శాశ్వతమంచిరెడ్డి పథకం కు ఎమ్మెల్యే సాంబశివరావు శ్రీకారం చుట్టారు. శుక్రవారం పాల్వంచ రూరల్ కారె గట్టు సారెకల్ మంచినీటి సమస్యకి శాశ్వత పరిష్కారం నిమిత్తం రూ 45 లక్షలతో కారగట్టు వద్ద 90 కే ఎల్ సంపు పంప్ హౌస్ కు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పాల్వంచ మండలంలో మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సమస్యకి పరిష్కారం చేయడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించడం నా బాధ్యతగా భావిస్తున్నానన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. అధికారులు తక్షణమే పారిశుద్ధ పనులు మెరుగుపరిచి అంటు వ్యాధులు, మలేరియా డెంగు, టైఫాయిడ్ లాంటి విష జ్వరాల ప్రబలక ముందే అధికారులు గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్, దోమల మందు కొట్టించాలని ఆదేశించారు.

హెల్త్ క్యాంపులు నిర్వహించి అన్ని రకాల పరీక్షలు చేసి ప్రజలును విష జ్వరాల బారిన పడకుండా చూడాలని అధికారులును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు.ఎంపీ.డీ.ఓ విజయ్ భాస్కర్ రెడ్డి, మిషిని భగీరథ ౄE సత్య సాయి, రూరల్ ఎస్త్స్ర సురేష్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ముత్యాల విశ్వనాథం నాయకులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు అడుసు మిల్లి సాయిబాబు కాంగ్రెస్ నాయకులు ఎర్రంశెట్టి మధు ఏ ఐ టి యు సి నాయకులు దుగ్గిరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.