12 March, 2026 | 5:06 AM

పేదల సొంతింటి కల నెరవేర్చిన నాయకుడు ఎమ్మెల్యే మదన్మోహన్

13-11-2025 01:01 AM

-ఇందిరమ్మ ఇళ్ల మూడో విడత నిధులు విడుదల 

-లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3.40 లక్షలు జమ!

-ఎమ్మెల్యే మదన్మోహన్ కృషికి లబ్ధిదారుల కృతజ్ఞతలు

ఎల్లారెడ్డి,నవంబర్,12,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మూడో విడత నిధులు విడుదలయ్యాయి. ఎల్లారెడ్డి మండలం సాతెల్లి గ్రామ లబ్ధిదారుల ఖాతాల్లో మూడో విడత నిధులు జమ కావడంతో గ్రామం అంతా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. పేదలకు సొంతింటి కలను నిజం చేస్తున్న ఈ పథకం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు కురుమ వెంకటవ్వ మాట్లాడుతూ మొదటి విడతగా బేస్మెంట్ కోసం రూ.1,00,000, రెండవ విడతగా గోడల నిర్మాణానికి రూ.1,00,000, ఇప్పుడు మూడో విడతగా స్లాబ్ బిల్లు రూ.1,40,000 మా ఖాతాలో జమ అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం రూ.3.40 లక్షలు వచ్చాయి. ఈ ఇల్లు మా జీవితంలో పెద్ద వరంగా నిలిచింది. ఇన్నాళ్లకు మా కలల ఇల్లు సాధ్యమైనది, మా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ వల్లే అని ఆనందభాష్పాలతో తెలిపారు.

గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టి ప్రతి లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ అభివృద్ధి ప్రేరణ. ఆయన కృషితో గ్రామంలో శాశ్వత గృహ కల సాకారమవుతోంది అన్నారు.  గ్రామ ప్రజలు ఎమ్మెల్యే మదన్ మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగరాజు తో పాటు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బాలకృష్ణ, కుమ్మరి రాజు, పసుపుల సంగయ్య, నారాయణ, వెంకటేష్, లచ్చయ్య, సాయిలు, ఇస్తారి, మంగలి బషయ్య, నిరుడి రాములు, గోపాలు తదితరులు పాల్గొన్నారు.