calender_icon.png 16 October, 2024 | 1:35 AM

పార్టీలకు అతీతంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

16-09-2024 03:38:13 PM

దేవరకద్ర, విజయక్రాంతి: పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి లబ్ధిదారులు కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారo మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకద్ర కౌకుంట్ల మండలాలకు చెందిన 97 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మహిళ సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజర్ సెక్రెటరీ అరవింద్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మీకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంజలి రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, అంజన్ కుమార్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆది హనుమంత్ రెడ్డి రామకృష్ణారెడ్డి వేణుగోపాల్ రెడ్డి వీరారెడ్డి రాము రాంపండు కిషన్ రావు నరసింహారెడ్డి రామాంజనేయులు రామస్వామి రాజశేఖర్ కౌకుంట్ల తాసిల్దార్ ఎల్లయ్య, దీపిక, శరత్ నాయక్,సంతోష్, వివిధ గ్రామాలకు చెందిన పార్టీ అధ్యక్షులు బూత్ కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు