మజ్జిగ పంపిణీతో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
ఘట్ కేసర్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) : చలివేంద్రాలు ప్రయాణికుల దాహార్తిని తీర్చుటకు ఎంతో ఉపయోగపడతాయని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో మల్లారెడ్డి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘట్ కేసర్ పట్టణంలోని బైపాస్ రోడ్డు చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సోమవారం స్థానిక బిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈసేవా కార్యక్రమాలను నిరంతరం ముందుండి నడిపిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులు ఎమ్మెల్యే మల్లారెడ్డి, రాష్ట్ర నాయకులు చామకూర భద్రరెడ్డిలకి నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బిఆర్‌ఎస్ పార్టీ ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్,
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లు రెడ్యానాయక్, పలుగుల మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్ లు చందుపట్ల వెంకటరెడ్డి, కొమ్మ గోని రమాదేవి, బండారి ఆంజనేయులుగౌడ్, బిఆర్‌ఎస్ నాయకులు నాగులపల్లి రమేష్, పన్నాల కొండల్ రెడ్డి, నల్లవెల్లి శేఖర్, మేకల నర్సింగరావు, రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, బద్దం జగన్ మోహన్ రెడ్డి, సామల సందీప్ రెడ్డి, బోనకుర్తి అర్జున్, బొడిగె శ్రీనివాస్ గౌడ్, పోత్నకని మల్లికార్జున రాజు, మీసాల రాజేష్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






