పేదల పెన్నిధి - సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
24-04-2026 04:33 PM
తాండూరు,(విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు సీఎం సహాయనిధి పెన్నిధి లాంటిదని వికారాబాద్ జిల్లా తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని పెద్దముల్, యాలాల, బషీరాబాద్, కోటిపల్లి మండలాలకు చెందిన 175 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.65,00,000/- (అరవై ఐదు లక్షల) విలువ గల CMRF చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






