16 August, 2026 | 2:23 PM

బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం

16-08-2026 01:44 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె(Bandla Ganesh Daughter Wedding) వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఇరువురు నేతలు ఆకాంక్షించారు. వివాహ వేడుకలో నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి, కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన నాయకులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.