30 July, 2026 | 1:09 AM

ఉమెన్ షెల్టర్ హోమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి

30-07-2026 12:00 AM

ఉమెన్ షెల్టర్ హోమ్ ‘స్త్రీ శక్తి సదన్’ వసతి గృహం ప్రారంభం

భార్యాభర్తల మధ్య విభేదాల పరిష్కారం కోసం కౌన్సెలింగ్ సెంటర్ కూడా ఏర్పాటు

సత్తుపల్లి జూలై 29 ( విజయ క్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మసీద్ రోడ్లో ఉమెన్ షెల్టర్ హోమ్ ‘స్త్రీ శక్తి సదన్’ గ్రామ వికాస్ వసతి గృహ భవనాన్ని సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ వసతి గృ హంలో ఒంటరి మహిళలు, జీవించడానికి ఎలాంటి ఆధారం లేని వారు, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, దివ్యాంగులు మరియు ఇతర ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న మహిళలకు ఆశ్రయం కల్పించేలా ఉమెన్ షెల్టర్ హోమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అంతేకాకుండా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నట్లయితే వారికి కౌన్సెలింగ్ అందించేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ సెంటర్ను కూడా ఇందులో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.