calender_icon.png 18 July, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి డైరెక్టర్ (పా) గౌతమ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే

18-07-2025 02:16:40 PM

ఇల్లెందు, (విజయక్రాంతి): సింగరేణి డైరెక్టర్ (పా) గౌతమ్(Singareni Director Gautam)ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఇల్లందులోని సింగరేణి సమస్యలపై ఆయన  చర్చించారు. ముక్యంగా ఏరియా నుంచి బొగ్గు రవాణాను పెంచాలని, లారీ యజమానులు సమస్యలను దృష్టిలో పెట్టుకొని పరిశీలించాలని కోరారు. ఇల్లందు, కోయగూడెం గనుల అభివృద్ధిపై ద్రుష్టి సారించాలని విన్నవించారు. ఇంకా ఇల్లందు ఏరియాలోని పలు సమస్యలని డైరెక్టర్ (పా) దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంట చిట్టిబాబు, సాంబమూర్తి, ఎమ్మెల్యే మిత్ర బృందం పాల్గొన్నారు.