calender_icon.png 13 September, 2024 | 12:27 AM

ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే మేఘారెడ్డి

08-08-2024 01:40:58 PM

కాలువ పనులు పరిశీలన...

వనపర్తి ( విజయక్రాంతి ) : నియోజకవర్గ పరిధిలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిచడం ధ్యేయంగా పని చేస్తున్నామని అందులో భాగంగా గత మూడు రోజులుగా కల్వకుర్తి ఎత్తిపోతల ప్రధాన కాలువలపై పర్యటిస్తూ, పంట కాలువలు, రెగ్యులేటర్లను కాలువల పటిష్టతను పరిశీలించడం జరిగిందని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. గురువారం గోపాల్పేట మండలంలోని జాకీర్ధర్ కాలువ గుడిపల్లి రిజర్వాయర్ D8, D5  ప్రధాన కాలువలతో పాటు బుద్ధారం కుడి ఎడమ కాలువల పరిశీలన, పెద్దమందడి, ఖిల్లా ఘనపురం, మామిడమాడ నేరుడు చెరువు, మున్ననూర్, తిరుమలాపూర్, చందాపూర్, ఖాన్ చెరువు, కాలువల నిర్మాణాలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్బంగా నీటి పారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ రాబోయే 15 రోజుల వరకు రైతులకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని అధికారులు నిరాటంకంగా నీటిని విడుదల చేయాలని వారిని ఆదేశించారు. కాలువల వెంట ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిధుల మంజూరి గురించి ఆలోచించకుండా పనులు చేయాలని నిధుల గురించి తను చూసుకుంటానని ఎమ్మెల్యే అధికారులకు భరోసా కల్పించారు. రైతులు ఎవ్వరు కూడా అధైర్య పడకూడదని నియోజకవర్గ పరిధిలోని ప్రతి చెరువుకు నీరందించేందుకు తాను వ్యక్తిగత బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే రైతులకు సూచించారు.