సీతారాంపల్లిలో మహిళా సంఘ భవనానికి భూమి పూజ
11-03-2026 08:30 PM
దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండలం సీతారాంపల్లి గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెన్నెల భానుశ్రీ సిద్ధరాములు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డీఈ స్వామిదాస్, ఏపీఎం శ్రీనివాస్, వివోఏ రాజశేఖర్, మాజీ సర్పంచ్ జలిగామ నాంపల్లి, రమేష్ బాబు, ఎల్లం సత్తయ్య పాల్గొన్నారు. అలాగే గ్రామ సంఘ అధ్యక్షురాలు బాలలక్ష్మి, కమిటీ సభ్యులు మనెవ్వ, సుమలత, కళావతి, మనవ దీప, నర్సవ్వ, భాగ్య, రోజా, కళ్యాణి, రాధా, యాదమ్మ, సిద్ధవ్వ, పావని, పద్మ, మహేశ్వరి, భారతవ్వ, మల్లవ్వ, దేవవ్వ తదితరులు పాల్గొన్నారు.




