2 May, 2026 | 9:23 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

అప్పు చెల్లించలేదని జరిగిన దాడిలో వ్యక్తి మృతి

11-03-2026 08:36 PM

చిట్యాల,(విజయక్రాంతి): నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో అప్పు చెల్లించలేదని వ్యక్తిపై జరిగిన దాడిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం  గ్రామంలో అప్పు వసూళ్ల విషయంలో సుర ఆంజనేయులు, ఓర్సు శంభు లింగం మధ్య  ఘర్షణ ఘర్షణ చోటు చేసుకోగా, శంభు లింగం కి తీవ్ర గాయాలు అవ్వగా హుటాహుటిన నార్కట్ పల్లి లోని కామినేని హాస్పిటల్ కి కుటుంబ సభ్యులు తరలించారు. ఛాతీలో బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ శంభులింగం (60) మృతి చెందాడు.

గతంలో పెద్ద మనుషుల సమక్షంలో రూ.80 వేల అప్పు చెల్లించినా కూడా ఇంకా డబ్బులు వస్తాయని ఇంటికి పిలిచి సురా ఆంజనేయులు దాడి చేశాడని కుటుంభ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో అధిక వడ్డీలతో ప్రజలను ఇబ్బందులు పెట్టిన విషయంలో సుర ఆంజనేయులు పై పలు కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనతో గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా, పోలీసులు భారీగా మోహరించారు. గాయపరిచి మృతికి కారణమైన ఆంజనేయులు పరారీలో ఉండగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నార్కట్ పల్లి ఎస్సై విష్ణుమూర్తి తెలిపారు.