పదవి స్వీకార మహోత్సవంకు పార్టీ శ్రేణులు తరలి రావాలి
నల్లగొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ బోడ స్వామి
చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ చైర్మన్ గా కవంపల్లి సత్యనారాయణ పదవి స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు తరలిరావాలని బోడ స్వామి బుధవారం పిలుపునిచ్చారు. చిట్యాల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ చైర్మన్ గా మానకొండూరు ఎమ్మెల్యే అయినా కవ్వంపల్లి సత్యనారాయణ
ఈ నెల 12న హైదరాబాదులోని గాంధీ భవన్ లో సాయంత్రం మూడు గంటలకు పదవి బాధ్యతలు చేపడుతున్నందున నల్లగొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు పాల్గొని పదవి స్వీకార మహోత్సవ కార్యక్రమం ను విజయవంతం చేయవలసిందిగా నల్లగొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ బోడ స్వామి పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రతి మండలం, గ్రామం నుండి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు పాల్గొనవలసిందిగా ఆయన కోరారు.




