12 May, 2026 | 11:50 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

అందరూ బాగుండాలన్నదే ప్రజా పాలన సంకల్పం

04-05-2026 03:18 AM

ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

భూత్పూర్ మే 3 : అందరూ బాగుండాలన్నదే ప్రజాపాలన సంకల్పమని దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం భూత్పూర్ మండల పరిధిలో గ్రామంలో గౌరమ్మ వారి ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదని ప్రతి ఒక్కరికి మేలు చేయాలని సంకల్పంతోనే పక్క ప్రణాళికలతో ఎక్కడ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సంప్రదించాలని ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు ఉన్నారు.