భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాగరాజు
05-03-2026 01:01 AM
వరంగల్, మార్చి 4 (విజయక్రాంతి): వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు తన జన్మదినాన్ని పురస్కరించుకొని పురస్కరించుకొని బుధవారం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, ధర్మకర్తలు వూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
పూజానంతరం ఆలయ స్నపన మండపంలో అర్చకులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా టి.ఎన్ జి.ఓ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, పలువురు యూనియన్ నాయకులు, కార్పోరేటర్ జన్ను షీబారాణి అనిల్ తదితరులు దుశ్శాలువలతో సత్కరించి పుష్పగుచ్ఛములు అందజేశారు.




