08-09-2025 12:00:00 AM
మణుగూరు, సెప్టెంబర్ 7, (విజయక్రాంతి) : పట్టణంలోని ఏరియా వంద పడ కల ప్రభుత్వఆస్పత్రిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం సాయం త్రం ఆకస్మికంగా సందర్శించారు. సిజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆస్పత్రిని సందర్శించి, ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను, ఆస్పత్రి పరిసరాలను,పరిస్థితుల ను పరిశీలించారు.
రోగులను పరామర్శించి బాగోగులు అడిగి తెలుసుకొని, వారికి అం దుతున్న వైద్యం పట్ల ఆరాతీశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, పనిచేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పా టిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని, గ్రామీణ ప్రజలకు వ్యాధి లక్షణాల గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గు రించి క్షుణ్ణంగా వివరించాలని సూచిం చా రు.
దూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చేరోగులకు సరైన సౌకర్యాలతో పాటు వై ద్యం అందించాలని, వైద్యులు, సిబ్బంది, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిరినాకి నవీన్, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, గాండ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.