calender_icon.png 11 September, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

08-09-2025 12:00:00 AM

చిట్యాల, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీలో కీలక మార్పులు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ, చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో ఆదివారం బిజెపి మండల అధ్యక్షుడు పీక వెంకన్న మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ జిఎస్టిని తగ్గించడం వల్ల నిత్యవసర సరుకులు భారీగా తగ్గుతాయని, జీవిత బీమాలను పూర్తిగా జిఎస్టి లేకుండా చేయడం సంతోషకరం అని అన్నారు.

విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ పై ఎలాంటి జీఎస్టీ లేకుండా, పేదవాడి కలలైనా కార్లు, ఏసి, వాషింగ్ మిషన్, ఎల్‌ఈడి టీవీ లపై పన్ను కుదించడం వల్ల భారం తగ్గుతుందన్నారు. రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లపై పన్ను భారం ఐదు శాతం కి చేర్చడం వల్ల రైతులు సంతోషిస్తున్నారని, పన్ను మార్పులు ఈనెల 22వ తేదీ నుంచే కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి అని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పొట్లపల్లి నరసింహ, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పున్న విష్ణు, వరికుప్పల నర్సింహా, ఉయ్యాల లింగస్వామి బూత్ అధ్యక్షులు పీక మహేష్, గంట మల్లేష్, సీనియర్ నాయకుడు కోరబోయిన లింగస్వామి, సత్యనారాయణ, శివకోటి లింగయ్య, శివకోటి ప్రవీణ్ సుధాకర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.