29 April, 2026 | 5:42 PM

ప్రజాపాలన ప్రగతి ప్రాణాళిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం

29-04-2026 04:08 PM

గుండాల,(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మండల పరిధిలోని రైతు వేదికలో అంగన్వాడీ టీచర్లకు 60 స్మార్ట్ ఫోన్లను, 14 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ చెక్కులను, ఆరుగురు లబ్ధిదారులకు రూ. రెండు లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ సేవలను గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అందిస్తున్నారని, వారికి సాంకేతిక సదుపాయాలు కల్పించడం ద్వారా సేవలు మరింత వేగవంతం అవుతాయని అన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, వ్యక్తిగత వివరాలను రక్షించుకోవాలని సూచించారు. పిల్లల భద్రత (Child Safety) మరియు రక్షణ (Protection)పై శ్రద్ధ తీసుకోవాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని (Stay Away From Drugs) పిలుపునిచ్చారు.