బీఆర్ఎస్ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
- సర్పంచ్ సహా సుమారు 100 కుటుంబాలు చేరిక
గుండాల,(విజయక్రాంతి): మండల పరిధిలోని రోళ్ళగడ్డ తండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ భూక్యా మంగమ్మ, 4, 5, 7 వార్డు సభ్యులు మరియు సుమారు 100 కుటుంబాలు బుధవారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వారిని ఎమ్మెల్యే పాయం పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం సర్పంచ్ మంగమ్మ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మెచ్చి, తమ గ్రామపంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి పరుచుకోవాలని అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ద్వంద వైఖరి నచ్చక, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు చేస్తున్న అభివృద్ధి పనులు నచ్చి వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పొంబోయిన ముత్తయ్య, జిల్లా కార్యదర్శి ఎస్కే ఖదీర్, ఏఎంసీ డైరెక్టర్ ఊకే బుచ్చయ్య, పలు గ్రామపంచాయతీల సర్పంచులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






