29 April, 2026 | 6:08 PM

పదవ తరగతి ఫలితాలలో నాగిరెడ్డిపేట్ మండలంలో 98.51%

29-04-2026 04:35 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు విడుదల చేసిన పదవ తరగతి పరీక్షల్లో ఫలితాల్లో భాగంగా నాగిరెడ్డిపేట్ మండలంలో 98.51% ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాశాఖ అధికారి వెంకట్రామిరెడ్డి తెలిపారు. నాగిరెడ్డిపేట్ మండలంలో పదవ తరగతి పరీక్షలకు 402 విద్యార్థులు పరీక్షలురాయగా 396 విద్యార్థులు ఉత్తీర్ణత కావడం జరిగింది.పదవ తరగతి  ఉత్తీర్ణత ఫలితాలలో మండల టాపర్గా తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి ఆర్.సందీప్/రంగిఈశ్వరయ్య,చినూరు గ్రామం 574/600 ప్రథమ ర్యాంకు సాధించారు.రెండవ స్థానం తెలంగాణ మోడల్ స్కూల్ యొక్క విద్యార్థి హర్షిత్ కుమార్/దుర్గయ్య తాండూర్ 565/600 రెండవ స్థానం సాధించడం జరిగింది.అలాగే మండలంలోని జడ్పీహెచ్ఎస్ మాల్తుమ్మెద, జడ్పీహెచ్ఎస్ తాండూర్, కేజీబీవీ నాగిరెడ్డిపేట్, TTWERIS నాగిరెడ్డిపేట్ మండలం 100% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి వెంకట్రామిరెడ్డి తెలిపారు.