11 July, 2026 | 6:51 PM

రూ.4.5 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే పాయం

11-07-2026 05:59 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాక భాస్కర్‌నగర్‌కు చెందిన రాయల వీరాంజనేయులుకు వైద్య చికిత్స కోసం మంజూరైన రూ.4.5లక్షల ఎల్‌ఓసీ పత్రాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ వైద్య చికిత్సకు దూరం కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్‌ఓసీ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం సహాయం అందిస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు