11 July, 2026 | 6:54 PM

Breaking News

ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి పారిశుద్ధ్య వాహనాలు మంజూరు చేయాలి   •   భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం   •   ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు భారీ స్పందన   •   మేడారంలో సమ్మక్క సారలమ్మ మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే   •   మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్   •   ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్   •   ప్రపంచ జనాభా దినోత్సవం, సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ   •   రూ.4.5 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే పాయం   •   నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల నిధులు మంజూరు   •   ఎస్‌ఐఆర్ ఫారాలు వెంటనే సమర్పించాలి   •  

మేడారంలో సమ్మక్క సారలమ్మ మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే

11-07-2026 06:12 PM

కుటుంబ సభ్యులతో కలిసి వన దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మేడారంలో సమ్మక్క - సారలమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించి వనదేవతలైన సమ్మక్క సారక్క మొక్కులు తీర్చుకున్నారు. శనివారం కుటుంబ సమేతంగా ములుగు జిల్లా మేడారానికి వెళ్లి దేవతల మొక్కులు తీర్చుకున్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మల ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని, గతంలో ఎన్నికలకంటే ముందు మొక్కుకున్నాందున ఈరోజు కుటుంబ సమేతంగా కలిసి మొక్కులు చెల్లించుకున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.